జాతీయ వార్తలు

వికలాంగుల హక్కుల చట్టంపై వెలువడిన ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు నుంచి 4 శాతం వరకు, ఉన్నత విద్యాసంస్థల్లో మూడు నుంచి అయిదు శాతం వరకు రిజర్వేషన్లను ఈ బిల్లు కల్పిస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ శుక్రవారం ఇక్కడ తెలిపారు. ‘పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆమోదం పొందిన ఈ బిల్లును తరువాత రాష్టప్రతి ఆమోదం కోసం పంపించడం జరిగింది. రాష్టప్రతి ఆమోదించిన తరువాత దానిని బుధవారం నోటిఫై చేయడం జరిగింది’ అని మంత్రి వివరించారు. నేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. మంత్రి ఈ సందర్భంగా నేషనల్ ట్రస్ట్‌కు చెందిన మొబైల్ యాప్‌ను, ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు.