జాతీయ వార్తలు

తీరుమారని చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితిలో చైనా మరోసారి అడ్డుకుంది. దీనిపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, చైనా తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో చైనా ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నట్లు ఇది రుజువు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ అన్నారు. ‘ఉగ్రవాదం వలన చైనా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్య సమితికి భారత్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విజ్ఞప్తి ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పరిశీలనలో ఉంది. ఈ కమిటీలోని 15 సభ్య దేశాలు భద్రతా మండలిలో కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి. మసూద్ అజార్‌పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించేందుకు అక్టోబర్‌లో భారత్ ప్రయత్నించగా, సాంకేతిక కారణాలను సాకుగా చూపి చైనా తాత్కాలికంగా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ గడువు ముగిసేలోగా చైనా మరోసారి అభ్యంతరాన్ని వ్యక్తం చేయకుండా ఉంటే మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానం ఆటోమ్యాటిక్‌గా ఆమోదం పొంది ఉండేది.