జాతీయ వార్తలు

మాలెగావ్ కేసులో కొత్త మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఎటిఎస్) మాజీ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మెహమూద్ ముజావర్ సోలాపూర్ కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008లో జరిగిన మాలెగావ్ పేలుళ్ల కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు వాస్తవానికి చనిపోయారని, అయితే ఉన్నతాధికారులు మాత్రం వారు ఇంకా బతికే ఉన్నారని చెబుతున్నారని ఆయన అన్నారు. కాగా, ముజావర్ చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటూ, ప్రభుత్వం ఈ అంశంపై దర్యాప్తు జరుపుతుందని చెప్పారు.
మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులైన సందీప్ దంగే, రామచంద్ర కల్సంగాలు ఎప్పుడో చనిపోయారని ముజావర్ సోలాపూర్ కోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ముజావర్ సోలాపూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో ఈ దరఖాస్తు దాఖలు చేశారు. ఈ దరఖాస్తులోని వివరాలు గురువారం వెలుగు చూశాయి.
సోలాపూర్ కోర్టులో దాఖలయిన ఆయుధాల చట్టం, బెదిరింపుల కేసులో ముజావర్ ఎటిఎస్‌నుంచి సస్పెండ్ అయ్యారు. తనపై పెట్టిన కేసును త్వరగా విచారించాలని కోరుతూ ముజావర్ ఈ ఏడాది ఆగస్టు 19న సోలాపూర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.‘సందీప్ దంగే, రాంజీ కల్సంగాలు నిజానికి ఎప్పుడూ చనిపోయారని, అయితే మాలెగావ్ బాంబు పేలుడు కేసులో ఉన్నతాధికారులు ఈ ఇద్దరూ ఇంకా బతికే ఉన్నారని చూపిస్తున్నారని ముజావర్ ఆ పిటిషన్‌లో ఆరోపించారు. కుట్రపూరితంగా తనపై కేసు పెట్టారని, కోర్టు అనుమతిస్తే ఈ ఇద్దరి మృతిపై వాస్తవాలు వెల్లడించాలని అనుకుంటున్నానని ముజావర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే ముజావర్ ఆరోపణలను ఎటిఎస్ చీఫ్ కెపి రఘువంశీ కొట్టిపారేశారు. నిజానికి ముజావర్ ఎవరో, ఈ కేసును దర్యాప్తు చేసిన బృందంలో ఆయన సభ్యుడనే విషయం కానీ తనకు గుర్తు కూడా లేదని ఆయన చెప్పారు. ఎటిఎస్‌లో తన హయాంలో ఇలాంటి సంఘటన ఏదీ కూడా జరగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎటిఎస్‌లో పని చేసి రిటైరయిన ఓ సీనియర్ పోలీసు అధికారి కూడా ముజావర్ ఎనిమిదేళ్ల తర్వాత ఈ విషయం ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 2009 సెప్టెంబర్ 29న మాలెగావ్‌లో ఉగ్రవాదులు మోటారు సైకిల్ బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోగా, వందమందికి పైగా గాయపడ్డారు.

మాలెగావ్ పేలుళ్లనాటి ఫైల్‌ఫొటో