జాతీయ వార్తలు

నోట్ల రద్దు ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: మార్చి 31 తర్వాత కూడా రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. పాత కరెన్సీ చెల్లుబాటును పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఈ ఆర్డినెన్స్ అవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గడువు తీరిన తర్వాత కూడా పదికి మించి పాత 500, 1000 నోట్లను కలిగి ఉంటే పదివేలు లేదా మొత్తం వీలువపై ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. ఈ నోట్లను డిపాజిట్ చేయడానికి ఎన్‌ఆర్‌ఐలకు జూన్ 30వరకూ గడువుఇచ్చారు. విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చే వ్యక్తులు తమ వద్ద పదికి మించి పాత నోట్లు లేవని విమానాశ్రయంలోనే కస్టమ్స్ అధికారులకు స్పష్టం చేయాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే 50వేలు లేదా పట్టుబడ్డ మొత్తంపై ఐదు రెట్లు జరిమానా విధిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.