జాతీయ వార్తలు

వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: పేద, దిగువ మధ్యతరగతివారికి రుణాల ఇవ్వడం వైపు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బ్యాంకులను కోరిన 24 గంటలల్లోపే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తన ప్రామాణిక రుణ రేటును 0.9 శాతం తగ్గించింది. దీంతో వివిధ కాలావధి కలిగిన రుణాల వడ్డీ రేట్లన్నీ కూడా ఆ మేరకు తగ్గనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.7 శాతం మేర తగ్గించగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం 0.65 శాతం 0.9 శాతం దాకా తగ్గించింది. రాబోయే రోజుల్లో మిగతా బ్యాంక్‌లు కూడా వీటిదారిలోనే తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ కొత్త వడ్డీ రేట్లు(ఎంసిఎల్‌ఆర్) జనవరి 1నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం ఏడాది కాలావధి కల రుణాలపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు లక్షల కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బిఐ ఈ చర్య తీసుకుంది. అలాగే రెండేళ్ల కాలావధి కలిగిన రుణాలకు వడ్డీ రేటు 8.10 శాతంగా, మూడేళ్ల కాలావధి రుణాలకు 8.15 శాతంగా ఉంటుందని కూడా ఎస్‌బిఐ ఆ ప్రకటనలో తెలిపింది.