జాతీయ వార్తలు

సేవా రుసుముకు చెల్లు చీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ఠారెస్తున్న సర్వీసు చార్జీలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఇతర పన్నులతో పాటు విధించే సర్వీసు చార్జి ఐచ్ఛికమేనని, దీన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ హోటళ్లు, రెస్టారెంట్లలో తమకు లభించే సేవల పట్ల వినియోగదారుడు సంతృప్తి చెందితేనే వాటిని చెల్లించాలి తప్ప నిర్బంధంగా చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారుల విభాగం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. అంటే ఈ చార్జీలను చెల్లించే లేదా చెల్లించకుండా ఉండే అధికారం వినియోగదారుడిదేనని వెల్లడించింది. సర్వీసు చార్జీలు తప్పనిసరి కాదు అన్న బోర్డులను అందరికీ కనిపించే విధంగా ఉంచాలని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. తమకు లభించిన సేవలు ఏ మాత్రం సంతృప్తి కలిగించక పోయినా సర్వీసు చార్జి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేయాలని కోరింది.టిప్‌లకు బదులు హోటళ్లు, రెస్టారెంట్లు ఐదు నుంచి 20శాతం వరకూ సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వినియోగదారుల వ్యవహారాల విభాగం రంగంలోకి దిగింది. దీనిపై భారత హోటళ్ల సంఘం నుంచి వివరణ కోరింది. సర్వీసు చార్జి అన్నది తప్పనిసరి కాదని, చెల్లించడం, చెల్లించక పోవడం వినియోగదారుడి ఇష్టమని హోటళ్ల సంఘం స్పష్టం చేసింది.