జాతీయ వార్తలు

జాలర్లకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: తన అధీనంలో ఉన్న 51మంది భారతీయ జాలర్లను వదిలిపెట్టేందుకు సోమవారం శ్రీలంక అంగీకరించింది. మరోవైపు భారత్ తన దగ్గరున్న ముగ్గురు లంక జాలర్లను వదిలేందుకు ఒప్పుకుంది. ఇరుదేశాల అధికారుల మధ్య సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. భారత, శ్రీలంక మంత్రిత్వ స్థాయి సమావేశంలో జాలర్లను విడిచిపెట్టేందుకు చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపి)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. భారత జాలర్లు ప్రయాణించిన అతిపెద్ద బోటును విడుదల చేసేందుకు శ్రీలంక అంగీకరించటం విశేషమని ఆయన అన్నారు. గతంలో జాలర్లను పలు సందర్భాల్లో విడుదల చేసిన లంక ప్రభుత్వం బోట్లను మాత్రం తన స్వాధీనంలోనే ఉంచుకుంది. భారత్ వైపునుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ నేతృత్వంలోని బృందం శ్రీలంక మత్స్యశాఖ మంత్రి మహింద అమరవీరతో సమావేశమై చర్చించి సత్ఫలితాల్ని సాధించిందన్నారు.