జాతీయ వార్తలు

అభివృద్ధి అజ్ఞాతవాసానికి స్వస్తి చెబుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 2: ఉత్తరప్రదేశ్‌లో గత పధ్నాలుగు సంవత్సరాలుగా సాగుతూ వచ్చిన అభివృద్ధి అజ్ఞాతవాసానికి త్వరలోనే తెరపడబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో సరికొత్త అభివృద్ధి శకం ప్రారంభం కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘గత పధ్నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేదు. ఆ అజ్ఞాతవాసం ముగుస్తుందని చాలామంది అంటున్నారు. కాని రానున్న ఎన్నికలతో ముగిసేది రాష్ట్రంలో అభివృద్ధి అజ్ఞాతవాసమే’ అని మోదీ అన్నారు. లక్నోలో సోమవారం జరిగిన పరివర్తన ర్యాలీలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్, బిఎస్‌పి, ఎస్‌పిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలూ అంతర్గత కుమ్ములాటలతో సతమతమైపోతున్నాయని, రాష్ట్రంలో అన్ని విధాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగే సత్తా బిజెపికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. యుపిలోని అధికార సమాజ్‌వాది పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు నిజంగానే పరివర్తనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. వరుసగా ఈ మూడు పార్టీలపై దుమ్మెత్తిపోసిన మోదీ ముందుగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా యువనేతను తెరపైకి తీసుకురావడానికి ఆ పార్టీ శతవిధాలుగా ప్రయత్నిస్తోందని వ్యంగ్యోక్తి విసిరారు.
ఇక రాష్ట్రంలో ప్రధాని ప్రతిపక్షమైన బహుజన సమాజ్ పార్టీకి డబ్బును ఎలా దాచుకోవాలన్న యావేనని, ఇందుకోసం బ్యాంకులను వెతుకులాడటంతోనే దీనికి సరిపోతోందని అన్నారు. ఇక అధికార సమాజ్‌వాది పార్టీ విషయానికి వస్తే, యాదవ కుటుంబాన్ని, దాని అధికారాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలన్నదే దీని ఏకైక లక్ష్యంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ను రక్షించడానికి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు రాగలిగే ఏకైక పార్టీ బిజెపియేనని ఉద్ఘాటించారు. మిగతా పార్టీలన్నీ కూడా ఇటు డబ్బును దాచుకోవడానికో, అటు కుటుంబ పాలనను పరిరక్షించుకోవడానికో అంకితమైపోయాయంటూ చురకలేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతుల బాగోగులను ఎస్‌పి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దేశానికి అన్నం పెడుతున్న రైతాంగం పట్ల అధికార పార్టీ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి దురదృష్టకరమన్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా మద్దతు అందుతున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి ఏమాత్రం ప్రధాన్యత అంశం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం విచారకరమంటూ వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో తనను, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రాష్ట్ర పార్టీలపై విమర్శలు గుప్పించారు.
‘అసలు సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పిలు ఎప్పుడైనా కలవడం మనం చూశామా? ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడని బిఎస్‌పి అంటే, అస్తమిస్తున్నాడంటూ సమాజ్‌వాది పార్టీ వాదిస్తుంది. కాని కేంద్రంలో మోదీని తొలగించే విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి అని ప్రధాని అన్నారు. పెద్దనోట్ల రద్దును గట్టిగా సమర్థించుకున్న మోదీ, దేశం నుంచి అవినీతి వృక్షాన్ని కూకటివేళ్లలో సహా పెకిలించివేసేవరకు తన పోరాటం ఆగదన్నారు. నల్లధనం, అవినీతిపై తాము నిరంతరం పోరాడతామని పేర్కొన్న మోదీ, దేశంలోని పేదలకు ప్రయోజనం కలిగించడం, వారి దోపిడీని అరికట్టడమే దీని ఏకైక లక్ష్యమన్నారు. ఈ దిశగా మరింత ముందుకు వెళ్లడానికి రాష్ట్ర ప్రజలు బిజెపి ఆశీర్వదించాలని, అభివృద్ధికే ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన, ‘్భరత దేశాన్ని ఉజ్జ్వల భవితవ్యం దిశగా పరుగు పెట్టించాలంటే, ఆ ప్రయత్నం ముందుగా యుపితోనే మొదలు కావాలని’ అన్నారు.

చిత్రం..లక్నోలో సోమవారం బిజెపి నిర్వహించిన పరివర్తన ర్యాలీలో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ