జాతీయ వార్తలు

సమాజం ఎటుపోతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: కొత్త సంవత్సరం వేడుకల సమయంలో బెంగళూరులో మహిళలపై జరిగిన సామూహిక లైంగిక వేధింపు సంఘటనపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కర్నాటక హోం మంత్రి జి.పరమేశ్వర, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీలకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు పంపింది. వీరిద్దరూ ఏ పార్టీకి చెందిన వారన్నదానితో తమకు నిమిత్తం లేదని, వీరు మహిళ పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం అన్నారు. సమాజంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తులే ఇలా మాట్లాడటాన్ని చూస్తే దేశం ఎటుపోతోందన్న ఆందోళన కలుగుతోందన్నారు. పురుషులందరూ ఒకేలా ఉంటారని తాము భావించడం లేదని కానీ 25శాతం మంది మాత్రం పురుషాధిక్య స్వభావంతోనే ఉన్నారని, వీరికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదని అన్నారు. బెంగళూరు ఘటనకు యువతులు పశ్చిమ దేశాల సంస్కృతిని అనుసరించడమే కారణమని కర్నాటక హోం మంత్రి అంటే..సగం దుస్తులతో మహిళలకు రాత్రి పొద్దుపోయిన తర్వాత వీధుల్లోకి వస్తే బెంగళూరు తరహా సంఘటనలే జరుగుతాయని సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర విభాగం అధినేత, ఎమ్మెల్యే అబూ ఆజ్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు.