జాతీయ వార్తలు

ప్రైవేట్ ఏజన్సీలు డేటా సేకరించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ఆధార్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్ల సత్వర విచారణకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరిస్తూ, అయితే ప్రైవేట్ ఏజన్సీలు దీనికి సంబంధించిన డేటా సేకరించడం మంచి ఆలోచన కాదని వ్యాఖ్యానించింది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమని పేర్కొంటూ, తమ పిటిషన్లను సత్వరం విచారించాలని ఒక పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ కోరినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘వనరులు పరిమితంగా ఉన్న కారణంగా దీనిపై మేము వెంటనే తీర్పు ఇవ్వలేము. అయితే ప్రైవేట్ ఏజన్సీలు డేటా సేకరించడం అనేది గొప్ప ఐడియా కాదు’ అని న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఏజన్సీలు బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తూ ఉన్నందున వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశమున్నందున ఈ విషయాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని ఒక పిటిషనర్ తరఫున వాదించిన దివాన్ పేర్కొన్నారు. 2015 అక్టోబర్ 15న సుప్రీంకోర్టు ఆధార్‌పై తాను ఇంతకుముందు విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ, ఈ నిబంధనలు అన్ని పింఛను పథకాలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వర్తిస్తాయని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను విచారించడానికి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అదే ఏడాది త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.