జాతీయ వార్తలు

విస్తృత ధర్మాసనమే తేలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: త్వరలో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్రమైన నేరాల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించ వచ్చా, విచారణ ఏ దశలో ఓ ప్రజాప్రతినిధి అనర్హతకు గురవుతాడనే అంశాలపై నిర్ణయించడానికి త్వరలోనే అయిదుగురు న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలియజేసింది. ‘వచ్చే ఎన్నికల నాటికల్లా చట్టం గురించి జనం తెలుసుకోవడానికి వీలుగా మేము ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోర్టుల్లో తీవ్రమైన నేరాలకుగాను విచారణను ఎదుర్కొంటున్న కరుడుగట్టిన నేరస్థులు పలువురు పోటీ చేయాలని అనుకుంటున్నందున ఈ అంశాలను వీలయినంత త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందన్న వాదనలను పరిశీలించిన సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఈ విషయాలను నిర్ణయించడానికి మేము త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, డివై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న బెంచ్ వ్యాఖ్యానించింది. తీవ్రమైన నేరాల్లో విచారణను ఎదుర్కొంటున్న చాలామంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని అనుకొంటూ ఉన్నందున న్యాయపరమైన ఈ ప్రశ్నలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్న కారణంగా ఈ అంశంపై దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని పిల్ దాఖలు చేసిన న్యాయవాది, ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ అన్నారు. ఈ ప్రశ్నలకు తాము తక్షణమే సమాధానమివ్వలేమని, ఎందుకంటే ఎన్నికల సమయంలో తప్పుడు కేసులు పెట్టవచ్చనే భయం ఉందని వాదోపవాదాల సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది.
క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్న ఒక ప్రజాప్రతినిధిని దోషిగా నిర్ధారించే సమయంలో అనర్హుడిగా ప్రకటించాలా లేక అభియోగాలు నమోదు చేసే సమయంలో ప్రకటించాలా తదితర అంశాలను విస్తృత ధర్మాసనం నిర్ణయించాలని పేర్కొంటూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గత ఏడాది మేలో ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్ సహా పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. ప్రస్తుతం తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. అలాగే ఒకవేళ దోషిగా నిర్ధారణ అయిన పక్షంలో ఎన్నికయిన ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. ఇదే అంశాలను లేవనెత్తుతూ పిల్స్ దాఖలు చేసిన వారిలో ఉపాధ్యాయ్ కాకుండా మాజీ ఎన్నికల ప్రధానాధికారి జెఎం లింగ్డో, ‘పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఉన్నాయి. ఈ పిల్స్‌ను త్వరలో ఏర్పాటు చేయబోయే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తారు.