జాతీయ వార్తలు

తొందరేముంది.. తర్వాత చూద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2017-18 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమర్పణను ఏప్రిల్ దాకా వాయిదా వేయాలని కోరుతూ దాఖలయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) త్వరగా విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ‘తొందరేముంది. మామూలుగా పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిల తేదీలను ప్రకటించిన దృష్ట్యా ఈ పిల్‌ను త్వరగా విచారించాలని ఆయన కోరారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఎన్నికల కోడ్‌ను అమలులోకి వచ్చినందున బడ్జెట్‌ను సమర్పించడం కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 4 మార్చి 8 మధ్య జరగనుండగా, దానికన్నా ముందు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.