జాతీయ వార్తలు

బేషరతు క్షమాపణ చెప్పిన కట్జూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా తన బ్లాగ్‌లో వ్యాఖ్యలు చేసినందుకుగాను శుక్రవారం బేషరతు క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణను మన్నించిన సుప్రీంకోర్టు ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలను నిలిపివేసింది. న్యాయమూర్తులు రంజన్ గొగో య్, యుయు లలిత్‌లతో కూడిన బెంచ్ కట్జూ చెప్పిన క్షమాపణను మన్నించిచి ఆయనపై కోర్టు ధిక్కరణ విచారణను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ‘క్షమాపణ చెప్పిన దృష్ట్యా ఆయనపై తక్షణ కోర్టు ధిక్కరణ చర్యలను మూసివేస్తున్నాం’ అని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. జస్టిస్ కట్జూ తరఫున హాజరయిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ క్షమాపణ చెప్తూ కట్జూ ఇచ్చిన సమాధానాన్ని చదివి వినిపించారు. కేరళ యువతి సౌమ్య అత్యాచారం, హత్య కేసులో దోషికి సుప్రీంకోర్టు కింది కోర్టు విధించిన మరణ శిక్షను తగ్గిస్తూ తీర్పు చెప్పడాన్ని తప్పుబడుతూ తన ఫేస్‌బుక్ పోస్టులో న్యాయ వ్యవస్థపై బురదజల్లే విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు జస్టిస్ కట్జూకు సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 11న కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జికి సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా, తన కేసును త్వరగా విచారించాలని కోరుతూ గత డిసెంబర్ 9న కట్జూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విజ్ఞాపనను అంగీకరించిన న్యాయస్థానం ఆయనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ రోజు విచారణ సందర్భంగా ధావన్ కట్జూ బేషరతు క్షమాపణలు చెప్తూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు రావడంతో కోర్టు ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.