జాతీయ వార్తలు

దేశభక్తుణ్నని చెప్పుకోవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ‘నేను నా దేశ భక్తిని నిరూపించుకోవలసిన పరిస్థితి రావడం ఒక్కోసారి నాకు చాలా బాధ కలిగిస్తోంది.. ఒక్కోసారయితే ఏడుపే వస్తుంది’ అని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ వాపోయారు. అంతేకాదు, తన కుటుంబం ఒక మినీ ఇండియా అని, తనకన్నా గొప్ప దేశ భక్తుడు ఎవరూ లేరని కూడా ఆయన స్పష్టం చేశారు. దేశంలో అసహనంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో షారుక్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత ఆయన దానిపై వివరణ ఇవ్వడం తెలిసిందే. ‘నేను ఈ దేశానికి చెందిన వాడినని, నేను దేశ భక్తుడినని చెప్పుకోవలసిన పరిస్థితి రావడం చూస్తే ఒక్కోసారి నాకు చాలా బాధ వేస్తుంది. నేనేకాదు మనమంతా దేశ భక్తులమే. మనం దేశ భక్తులమని చెప్పుకోవడానికి ఇతరులతో పోటీ పడాల్సిన అవసరం లేదు’ అని ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ కార్యక్రమం ‘ఆప్ కి అదాలత్’ ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ అన్నారు.