జాతీయ వార్తలు

మోదీని తప్పించి అద్వానీకి పగ్గాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 6: నోట్ల రద్దు వ్యవహారం, చిట్‌ఫండ్ కుంభకోణాల్లో తమ పార్టీ ఎంపీలను అరెస్టు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్న తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇంటికి సాగనంపాలని, బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేదా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీనుంచి దేశాన్ని కాపాడడానికి రాష్టప్రతి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ విభేదాలను మరిచి దేశాన్ని కాపాడడానికి ఒక్క తాటిపైకి రావాలని కూడా ఆమె అన్నారు. శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మమత దేశంలో నెలకొన్న పరిస్థితి ఏమాత్రం బాగా లేదంటూ ‘దేశాన్ని కాపాడడానికి రాష్టప్రతి జోక్యం చేసుకోవలసిన సమయం వచ్చింది. ఆ వ్యక్తి (మోదీ) దేశాన్ని నడపలేరు. ఆయన దిగిపోవాలి. జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావాలి ’ అని అన్నారు. నోట్ల రద్దు ఆర్థిక వృద్ధి వేగం మందగించడానికి దారితీస్తుందంటూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం చేసిన ప్రకటనను ఆమె సమర్థించారు. కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రణాళికా సంఘం లాంటి ఎన్నో ఏళ్లుగా ఉండిన సంస్థలను వాళ్లు ముక్కలు చేస్తున్నారు. ప్రభుత్వం వెన్ను విరుస్తున్నారు’ అని మమత అన్నారు. నోట్ల రద్దు కారణంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 5,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రం ప్రతిపక్షాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తోందన్నారు. అంతేకాదు బిజెపి అధికారంలో ఉన్న జార్ఖండ్‌ను తాను సందర్శించినప్పుడు దమ్ముంటే తనను ముట్టుకోవాలని కూడా ఆమె బిజెపి నేతలను సవాలు చేశారు. ‘రాష్టమ్రంత్రులు ఇద్దరు, మా పార్టీ నేతలు జార్ఖండ్‌ను సందర్శించి రాష్ట్రప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కున్న గిరిజనులను కలుస్తారు. వారు తిరిగి వచ్చి నాకు నివేదిక సమర్పించిన తర్వాత నేను జార్ఖండ్ సందర్శిస్తాను. బిజెపి పాలిత రాష్ట్రంలో నేను పర్యటిస్తే చావ కొడతామని బిజెపి నేతలు అంటున్నారు. వాళ్లు నన్ను కనీసం తాకగలరేమో చూస్తా’ అని మమత అన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్టు తర్వాత పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కార్యాలయాలపై వరస దాడులు దాడులు చేయడంతో పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణమాలాను ఎదుర్కోవలసి వస్తుందని బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ తృణమూల్ కాంగ్రెస్‌ను ఇటీవల హెచ్చరించడంపై స్పందిస్తూ మమత ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ గనుక టిఎంసి నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం ప్రారంభిస్తే ఆ పార్టీ ఎంపీలు చివరికి మమతా బెనర్జీ దేశంలోఎక్కడా తిరగలేరని, ఢిల్లీలో సైతం అడుగుపెట్టలేరని కూడా విజయ్‌వర్గీయ హెచ్చరించారు.

చిత్రం..శుక్రవారం కోల్‌కతాలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ