జాతీయ వార్తలు

విజయం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: పేదల పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, ఇతర పార్టీలనుంచి బిజెపి వారిని లాగేసుకుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంటూ, ఇప్పుడు పేదలు ప్రధాని నరేంద్ర మోదీకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి నోట్లరద్దు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ దాడులు ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉంటాయని చెప్పిన ఆయన వాటిని చరిత్రాత్మక నిర్ణయాలుగా అభివర్ణించారు. నోట్ల రద్దు వల్ల రెవిన్యూలు బాగా పెరుగుతాయని, పెరిగిన రెవిన్యూను పేదల సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నోట్లరద్దును ప్రతిపక్షాలు విమర్శించడాన్ని తప్పుబట్టారు. నల్లధనాన్ని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకు రావడం లేదని ఇంతకు ముందు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉండేవని, అయితే ఇప్పుడు నోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాయన్నారు. ఇది వాళ్ల డొల్లతనాన్ని బైటపెడుతోందన్నారు.
ఉత్తరప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లోను బిజెపి విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లోకోజికోడ్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలంతా కూడా ఊరి ఉగ్రవాద దాడుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారని, అయితే ఆ తర్వాత ప్రభుత్వం రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అమిత్ షా అన్నారు. సర్జికల్ దాడులు ఉగ్రవాదానికి భారత్ ఇచ్చిన సమాధానమని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం కూడా సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అంటూ, ప్రజలు తమను కేవలం పాలించడం కోసం ఎన్నుకోలేదని, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి, పేదల భవిష్యత్తును మార్చడం కోసం ఎన్నుకున్నారన్నారు. అందుకే ప్రజలు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని, పేదలు మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. నోట్ల రద్దును ప్రజలు ముక్తకంఠంతో సమర్థిస్తున్నారని సర్వేలు సైతం చెబుతున్నాయని అంటూ,ప్రతిపక్ష పార్టీల చేతుల్లోంచి పేదలను బిజెపి లాగేసుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీలకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదని అమిత్ షా అన్నారు.
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అమిత్ షా ప్రసంగం గురించి విలేఖరులకు వివరిస్తూ, ఈ రెండు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్న విశ్వాసాన్ని పార్టీ అధ్యక్షుడు వ్యక్తం చేశారని చెప్పారు.

చిత్రం..న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు ఎం.ఎం.జోషి, మధ్యప్రదేశ్ సిఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్‌కుమార్