జాతీయ వార్తలు

సెజ్ భూములపై విచారణ వాయిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్)లలో నిరుపయోగంగా ఉన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. 2006లో సెజ్‌లు ఏర్పాటుకు దేశవ్యాప్తంగా వందల ఎకరాలు భూములను తీసుకొని అందులలో సగానికి పైగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేందటూ కాకినాడ రైతు సంక్షేమ సంస్ధ సుప్రీంలో పిటిషన్ వేసింది. సెజ్‌ల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకుని అక్రమాలకు పాల్పడిన వారిపై కేంద్ర దర్యాప్తు సంస్ధచే విచారణ చేయించాలని పిటిషనర్ కోరారు. కాగా ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ప్రకటించింది.