జాతీయ వార్తలు

భారత్‌లో అసహన వాతావరణం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: రాజకీయ వ్యవస్థలో అధికార పక్షంలో, లేదా ప్రతిపక్షంలో ఉన్న వారు బాధ్యతా రహితమైన ప్రకటనలు చేసిన సంఘటనలు ఒకటి, రెండు ఉంటే ఉండవచ్చునని, అంతమాత్రాన దేశంలో అసహన వాతావరణం ఉందంటూ చెప్పడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అలాంటి సంఘటనలు దారుణమని ఆయన అంటూ, భారత్‌లాంటి పెద్ద దేశంలో అలాంటి సంఘటనలు అరుదని అభిప్రాయ పడ్డారు. ‘ఇవి చాలా చెడ్డ సంఘటనలు. ఇవి దారుణమైన సంఘటనలు. అయితే భారత్‌లాంటి పెద్ద దేశంలో ఇవి చాలా అరుదైన సంఘటనలే. చారిత్రకంగా చాలా అరుదైన సంఘటనలే జరిగాయి’ అని భారతీయ జర్నలిస్టులతో జరిగిన మీడియా రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ జైట్లీ అన్నారు. భారత దేశంలో అసహనం ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణల గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇదంతా మీడియా సృష్టేనన్నారు. ‘వాస్తవానికి నాకు అర్థమయినంతవరకు అసహనం ఉన్నట్లుగా చెప్పే సంఘటనలు ఏమయినా జరిగాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. భారత్‌లాంటి పెద్ద దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటీ అరా సంఘటన జరిగితే జరగవచ్చు, అది కూడా ఎంతమాత్రం సమర్థనీయం కాదు’ అని జైట్లీ అన్నారు.