జాతీయ వార్తలు

డిపాజిట్లపై ఐటి ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు (నవంబర్ 8) దేశంలోని అన్ని బ్యాంకుల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలను విశే్లషించడంపై ఆదాయపన్ను (ఐటి) విభాగం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా నిరుడు ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9వరకు పొదుపు ఖాతాల్లో ఉన్న నగదు డిపాజిట్లపై నివేదిక సమర్పించాలని బ్యాంకులకు ఐటి విభాగం స్పష్టం చేసింది. అలాగే బ్యాంకు ఖాతాలు తెరిచినప్పుడు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్)ను గానీ ఫామ్-60ని గానీ సమర్పించని ఖాతాదారులు, పెన్షనర్లు ఎవరైనా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆ వివరాలు సమర్పించాల్సిందిగా వారికి స్పష్టం చేయాలని కూడా ఐటి విభాగం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో బ్యాంకులను ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ఫాసులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులన్నీ నిరుడు ఏప్రిల్ 1నుంచి నవంబర్ 9 వరకు తమ వద్ద గల నగదు డిపాజిట్ల వివరాలన్నింటిపై ఆదాయ పన్ను విభాగానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఖాతాదారుల నుంచి తీసుకున్న పాన్‌ను లేదా పాన్ కార్డు లేని వారి నుంచి తీసుకున్న ఫామ్-60ని డాక్యుమెంట్ చేసి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఆదాయ పన్ను చట్టంలోని 114బి నిబంధన కింద నిర్వహించాల్సి ఉంటుంది.
మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల సొమ్ము బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తుండటంతో దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి మనీ లాండరింగ్ లాంటి అక్రమాలేమైనా జరిగాయేమో పరిశీలించేందుకు ఆదాయ పన్ను విభాగం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇవై (ఎర్నెస్ట్‌యంగ్), కెపిఎంజి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ ట్యాక్స్ కన్సల్టెంట్లతో ఐటి విభాగం సంప్రదింపులు జరుపుతోంది.
రూ.4,807 కోట్ల నల్లధనం గుర్తింపు
పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నల్ల కుబేరులపై దాడులు నిర్వహించిన ఐటి అధికారులు ఇప్పటివరకూ రూ.4,807 కోట్లకు పైగా అప్రకటిత సొమ్మును గుర్తించడంతో పాటు రూ.112 కోట్ల విలువైన కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 8వ తేదీన పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన నాటి నుంచి ఐటి అధికారులు ఇప్పటివరకూ దేశంలోని 1,138 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ రూ.609.39 కోట్లకు పైగా ఉందని, వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోట్లే రూ.112.8 కోట్లు ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి.