జాతీయ వార్తలు

మాతృదేశమే ముందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 8: పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిపై ప్రదాని నరేంద్రమోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ చర్య ప్రజా వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్న వారిని ఆయన దుయ్యబట్టారు. వీరంతాకూడా దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్న అవినీతిని, నల్లధనాన్ని పూజించే వాళ్లంటూ విమర్శించారు. బెంగళూరులో జరుగుతున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల్లో ఆదివారం ప్రదాని ప్రసంగించారు. నల్లధనం, అవినీతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సమాజాన్ని దెబ్బ తీస్తున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అవినీతి, నల్లధనంపై భారీ యుద్దం ప్రకటించిందని ఆయన చెప్పారు. నల్లధనం, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్తూ, ఈ పోరాటానికి తమ మద్దతు తెలియజేసినందుకు ప్రవాస భారతీయులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు 69 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చారన్నారు. ఎఫ్‌డిఐ అంటే అందరూ ‘్ఫరిన్ డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్’ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) అని అర్థం చెబుతారని అయితే తాను మాత్రం ‘్ఫస్ట్ డెవలప్ ఇండియా’(మొదట భారత్‌ను అభివృద్ధి చేయండి) అని అర్థం చెబుతానని అన్నారు. ‘21వ శతాబ్దం భారత దేశానిదేనని నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పగలను’ అని కూడా ప్రధాని అన్నారు. కాగా, ‘బ్రెయిన్‌డ్రెయిన్’ (మేధోవలస)ను ‘బ్రెయిన్ గెయిన్’ (మేధో లాభదాయకత)గా మార్చాలని తాము అనుకుంటున్నామని చెప్పారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలను కోరుకునే యువత కోసం ప్రభుత్వం త్వరలోనే ‘ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. విదేశాల్లో ఆర్థిక అవకాశాలను కోరుకునే వారికి వీలయినంత ఎక్కువ అవకాశాలు కల్పించడంతో పాటుగా తక్కువ ఇబ్బందులు ఉండేలా చూడాలనేది తమ ప్రయత్నమన్నారు. దీనిలో భాగంగా యువతకు సాఫ్ట్ స్కిల్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటుగా వివిధ సంస్కృతుల గురించి బోధిస్తామని చెప్పారు.
విదేశాల్లోని భారతీయులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు ప్రతినిధులని ప్రధాని అంటూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ సత్తాను చాటుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారని అంటూ.. వారి సంక్షేమం, రక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని చెప్పారు. తాము పాస్‌పోర్టు రంగు చూడమని రక్త సంబంధాన్ని మాత్రమే చూస్తామని ఆయన అన్నారు.కాగా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పిఓఐ) కార్డులను ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్ (ఓఐసి) కార్డులుగా మార్చుకునే గడువును మరి కొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ఎటువంటి జరిమానా లేకుండా డిసెంబర్ 31నుంచి జూన్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చని చెప్పారు. దేశానికి ఐటి రాజధాని అయిన సుందర నగరం బెంగళూరులో ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈసారి ప్రవాస భారతీయ దివస్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి 6వేల మందికి పైగా ప్రతినిధులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. భారతీయ సంతతికి చెందిన పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా ఈఏడాది ప్రవాసీ దివస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవగా, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటుగా పలు రాష్ట్రాల సిఎంలు, పలువురు కేంమ్రంత్రులు ఈ రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాల చివరి రోజయిన సోమవారం నాడు రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేస్తారు.

చిత్రం..పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ