జాతీయ వార్తలు

స్వచ్ఛ్భారత్ ప్రచారాన్ని అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్‌సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎన్నికలకోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కింద ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎన్నికల కమిషన్‌ను కోరింది. 2019 అక్టోబర్ నాటికల్లా దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తయారు చేయడం లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రకటనలను కొనసాగించడానికి ‘నో అబ్జెక్షన్’ సర్ట్ఫికెట్ ఇవ్వాల్సిందిగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ, స్వచ్ఛ్భారత్ మిషన్ డైరెక్టర్ కూడా అయిన ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల కమిషన్‌లో సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌కె శ్రీవాత్సవకు రాసిన లేఖలో కోరారు. ఈ లేఖ కాపీలను ఎన్నికల కమిషనర్ ఓ.పి రావత్, ఎకె జోటిలకు కూడా పంపించారు. స్వచ్ఛ్భారత్ మిషన్ కింద కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిఏవిపి ద్వారా టీవీ, రేడియో ప్రింట్ మీడియలోను అలాగే హోర్డింగ్‌లు, పోస్టర్ల ద్వారా అన్ని రాష్ట్రాల్లోను పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
బహిరంగ మల విసర్జనను ఆపేలా జనం ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చేందుకు ‘అసలీ తరాకీ’ పేరుతో ఒక ఉద్యమాన్ని, అలాగే దేశవ్యాప్తంగా 500 పట్టణాలకు స్వచ్ఛ్భారత్ ర్యాంకులు ఇవ్వడానికి ఈ నెల 4న ప్రారంభించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సర్వేలో పాలుపంచుకునేలా జనంలో చైతన్యం తీసుకు వచ్చేందుకు మరో ప్రచార కార్యక్రమాన్ని.. మొత్తం రెండు ప్రచార కార్యక్రమాలను ప్రస్తుతం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అయితే ఇటీవల అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇసి తేదీలను ప్రకటించిన దృష్ట్యా షెడ్యూల్ ప్రకారం ఈ రెండు ప్రచార కార్యక్రమాలను కొనసాగించడానికి ‘నో అబ్జెక్షన్’ సర్ట్ఫికెట్ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ కోరుతోంది. నిర్ణీత గడువులోగా ఈ మిషన్ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే జనం ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ శాఖ భావిస్తోంది.