జాతీయ వార్తలు

పార్టీలో ఎలాంటి వివాదం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 8: సమాజ్‌వాదీ పార్టీ ఒక వైపు నిట్టనిలువునా చీలిపోయినప్పటికీ పార్టీలో ఎలాంటి వివాదం లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. ములాయం తన సోదరుడు, పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ఆదివారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక విలేఖరి.. అధినేత కుటుంబంలో, పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు గురించి ప్రశ్నించగా, ‘మా పార్టీలో ఎలాంటి వివాదం లేదు’ అని ఆయన బదులిచ్చారు. సమావేశానంతరం ఆయన శివపాల్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. పార్టీ చీలిపోయిన నేపథ్యంలో తన నాయకత్వంలోని పార్టీకి అధికార చిహ్నమైన సైకిల్ గుర్తును కేటాయించాలని ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి కోరే అవకాశం ఉంది. పార్టీలోని ఇరు వర్గాలకు తమ బలాన్ని నిరూపించుకునేందుకు అఫిడవిట్లు సమర్పించడానికి ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ఈ నెల తొమ్మిదో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ తనకు మద్దతు ఇస్తున్న వారి అఫిడవిట్లను సోమవారం ఎన్నికల సంఘానికి సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ములాయం కుమారుడు, యుపి సిఎం అఖిలేశ్ యాదవ్ వర్గం తమకు మద్దతు ఇస్తున్న వారి అఫిడవిట్లను శనివారమే ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇదిలా ఉండగా, ములాయం సింగ్ పార్టీ కార్యాలయంలోని తన గదిని తిరిగి కైవసం చేసుకున్నారని, అక్కడ తన, శివపాల్ యాదవ్ నేమ్‌ప్లేట్‌లను ఉంచారని సమాచారం. అయితే వారి నేమ్‌ప్లేట్లను ఎన్నడూ తొలగించలేదని అఖిలేశ్ వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ చెప్పారు. అఖిలేశ్ జీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని, అతని నాయకత్వంలోనే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని నరేశ్ తెలిపారు.
పార్టీ అధినేతను నేనే
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిని తానేనని, తన సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడని ములాయం సింగ్ యాదవ్ ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. గత ఆదివారం పార్టీ జాతీయ సదస్సును నిర్వహించిన రాంగోపాల్ యాదవ్‌కు ఆ హక్కు లేదని, ఎందుకంటే అంతకన్నా రెండు రోజుల ముందే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందని ములాయం అన్నారు. ఆదివారం ఢిల్లీకి చేరుకున్న తరువాత ములాయం శివపాల్, అమర్ సింగ్‌లతో సమావేశమయ్యారు.