జాతీయ వార్తలు

ఇక ఆన్‌లైన్‌లోనే పింఛను ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: పింఛనుకు సంబంధించిన అన్ని కేసుల ప్రక్రియను తప్పనిసరిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. పింఛను కేసుల ప్రక్రియలో జాప్యాన్ని నివారించటంతో పాటు మరింత పారదర్శకతను నెలకొల్పటానికి కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛను వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులను ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలులోకి వస్తే ఉద్యోగులు పదవీవిరమణ పొందిన తరువాత పింఛనుతో పాటు ఇతర ప్రయోజనాలను సకాలంలో అందుకోవడానికి వీలు పడుతుంది. పింఛనుకు సంబంధించి సమగ్రమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల్లో అనేక మందికి సకాలంలో పదవీవిరమణ అనంతర ప్రయోజనాలు, పింఛను చెల్లింపు ఆదేశాలు (పిపిఒ) అందడం లేదని మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలలో పేర్కొంది. ఉద్యోగులకు పదవీవిరమణ అనంతరం ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అనేదానిని తనిఖీ చేయడానికి ‘్భవిష్య’ పేరిట ఆన్‌లైన్‌లో పింఛను మంజూరు, చెల్లింపును పర్యవేక్షించే వ్యవస్థను ప్రారంభించినట్లు తెలిపింది. పాలనాధికారులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా ప్రక్రియ ప్రతి దశలో కదలికను దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించింది. అందువల్ల ఇప్పటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు అన్ని పింఛను కేసుల ప్రక్రియను ‘్భవిష్య’ ద్వారానే కొనసాగించాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాన్ని సమర్పించడానికి రిటైర్డ్ ఉద్యోగులకు అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు సహకరిస్తారని పేర్కొంది.