జాతీయ వార్తలు

ప్రగతి పతాక రైల్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 9:రైల్వే మంత్రిత్వ శాఖను బేరసారాల పాచికగా వాడుకునే గత సంస్కృతికి స్వస్తి పలుకుతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు అనుసరించిన ఈ పద్ధతికి భిన్నంగా రైల్వేలను సమగ్ర రీతిలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మిత్ర పక్షాలకు రైల్వే మంత్రిత్వ శాఖను ట్రోఫీగా పంచేదని.. అంతే కాదు, తమకు రైల్వే శాఖను ఇస్తేనే ప్రభుత్వంలో చేరతామని కూడా మిత్ర పక్షాలు షరతులు పెట్టిన సందర్భాలూ ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. డిమాండ్ చేసి మరీ రైల్వే శాఖను అందిపుచ్చుకున్న పార్టీలు రైల్వే అభివృద్ధిపై ఎంత మాత్రం దృష్టి పెట్టలేదని, కేవలం తమ స్వప్రయోజనాల కోసమే పని చేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు. 250 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించ తలపెట్టిన గాంధీనగర్ రైల్వే స్టేషన్ పనులకు సోమవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. ఇక్కడే 300 గదులతో ఫైస్ స్టార్ హోటల్‌నూ నిర్మిస్తామన్నారు. రెండున్నరేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైల్వేల విస్తరణ, అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, సామాన్యుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. గతంలో రైల్వే శాఖకు కేటాయించిన బడ్జెట్‌ను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింతలు చేశామన్నారు. ఇప్పటి వరకూ తాము చేపట్టిన రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ప్రధాని పట్టాల డబ్లింగ్ కూడా వేగాన్ని పుంజుకుందని చెప్పారు. విద్యుదీకరణ, గేజ్ మార్పిడులను కూడా వేగవంతం చేశామన్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన తమ ప్రభుత్వం ఇందులో భాగంగా అంతర్జాతీయ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలోనూ వైఫైని ప్రవేశ పెట్టడంతో పాటు రైళ్ల వేగాన్నీ పెంచామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 70శాతం సరుకుల రవాణా రైళ్ల ద్వారానే జరుగుతుందని, మిగతా ముప్పయి శాతమే రోడ్ల ద్వారా జరుగుతుందని తెలిపారు. కానీ భారత్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయని, రైల్వేల ద్వారా 15 నుంచి 20శాతం మాత్రమే సరుకుల రవాణా జరుగుతోందని, 70 నుంచి 80శాతం సరుకుల రవాణా రహదారి మార్గాల ద్వారానే సాగుతోందని గుర్తు చేశారు. రోడు మార్గాల ద్వారా సరుకుల్ని రవాణా చేస్తే అవి మరింత వ్యయభరితమవుతాయని చెప్పిన మోదీ దేశ వ్యాప్తంగా సరుకుల కారిడార్ల నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. పట్టణాల్లో ఉన్న రైల్వే స్టేషన్లపై బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించడం ద్వారా వాటిని మరింతగా అభివృద్ధి చేయవచ్చునని సూచించారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్ తరహాలో దేశ వ్యాప్తంగా 23రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ సందర్భంగా వెల్లడించారు.