జాతీయ వార్తలు

రక్త పరీక్షతో ఆయుష్షు నిర్ధారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: కేవలం రక్తపరీక్షతో ఓ వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడు, వృద్దాపత్యంలో డిమెన్షియా (మతిమరుపు)సహా ఏ రకమైన సమస్యలు లేకుండా మనుగడ సాధించగలుగుతాడు అన్నదానిపై తాజాగా ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. రక్తంలో ఉండే కొన్ని రకాల జీవ, రసాయనిక పదార్థాల ఆధారంగా ఒక వ్యక్తి ఆయుర్దాయాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా ఒక వ్యక్తికి ఏ రకమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది అనే సంకేతాలను కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని, తద్వారా నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఒక అధ్యయన పత్రంలో వెల్లడించారు. దాదాపు ఐదువేల మంది రక్త నమూనాలను సేకరించి, వాటిని పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు రాగలిగారు. ఈ బయోమార్కలు, లేదా రసాయనిక సమ్మిళితాల స్వరూపాన్ని తాము అధ్యయనం చేశామని, ఒక్కొక్కరిలో ఒక రకమైన రోగ లక్షణ అవకాశాలు కన్పించాయని తెలిపారు. కొందరిలో డిమెన్షియా, ఇంకొందరిలో అంగవైకల్యం, మరికొందరికి ఏ రకమైన జబ్బులు వచ్చే అవకాశం లేకపోవడం వంటివి ఈ పరీక్షల ద్వారా స్పష్టమైందని వెల్లడించారు. ఈ పరీక్షల సారాంశంగా వృద్ధాప్య జబ్బులను నివారించే మందులను, చికిత్సా విధానాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రక్తంలోని బయోమార్కర్ సంకేతాల ద్వారా చాలా ముందుగానే రోగ లక్షణాలను తెలుసుకోవచ్చునని తెలిపారు.