జాతీయ వార్తలు

సర్‌చార్జీలు భరించనక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే ఇంధన కొనుగోళ్లపై లావాదేవీల సర్‌చార్జి భారాన్ని అటు వినియోగదారులు గానీ ఇటు పెట్రోలు బంకు యజమానులు గానీ భరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వివరణ ఇచ్చారు. మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండిఆర్) లేదా పెట్రోల్ పంప్ ట్రాన్షాక్షన్ ఫీజు అనేది బ్యాంకులకు, చమురు మార్కెటింగ్ కంపెనీలకు మధ్య సాగే వ్యాపార వ్యవహారమని, కనుక ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారని స్పష్టం చేశారు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై జరిగే ఇంధన కొనుగోళ్లపై సర్‌చార్జి వసూలును వ్యతిరేకిస్తున్న పెట్రోలు బంకులు కార్డుల ద్వారా చెల్లింపులను అంగీకరించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం విదితమే. ఆదివారం ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సర్‌చార్జి విధింపుపై బంకు యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని 13వ తేదీకి వాయిదా వేసుకున్నాయి. అయితే పెట్రోలు బంకుల్లో ఇంధన కొనుగోళ్లకు అప్పటివరకు కూడా డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీకరించడం జరుగుతుందని ధర్మేంద్ర ప్రధాన్ ధ్రువీకరించారు. వినియోగదారులు, పెట్రోలు బంకుల యజమానులపై చార్జీల భారం పడకుండా నిరోధించేందుకు బ్యాంకులు, చమురు మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు కూర్చుని ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. తద్వారా వినియోగదారులు, పెట్రోలు బంకుల యజమానులపై చార్జీల భారం పడకుండా చూడాలని ధర్మేంద్ర ప్రధాన్ కోరారు.