జాతీయ వార్తలు

యూఏఈలో చిక్కుకున్న నావికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఆజ్‌మన్‌లో వ్యాపార ఓడల్లో 41మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారని సుష్మా తెలిపారు. వీరికి అవసరమైన పదార్థాలు సరఫరా చేయాలని, సౌకర్యాలు కల్పించాలని యుఏఈ లోని దౌత్య కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. నాలుగు వాణిజ్య ఓడల్లో 41మంది భారతీయులు పనిచేస్తున్నారని వీటిలో రెండు ఓడలు లీక్ అవుతున్నాయని, మునిగిపోయే స్థితిలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఆ ఓడల్లోని ఉద్యోగులు ప్రాణాలు రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రెండు ఓడల కెప్టెన్లతో మాట్లాడటం జరిగింది. యూఏఈ పోర్ట్ అథారిటీని కూడా సంప్రతించాం. మరో రెండు వారాలకు సరిపడా నిత్యావసరాలు వారికి అందుబాటులో ఉన్నాయి. అవసరమైన బకాయిలు చెల్లించి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. బాధితులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, యూపి, బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, తమిళనాడుల నుంచి వచ్చారని సుష్మా ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన 500మంది ఇరాక్‌లో చిక్కుకుపోయారని సుష్మా ఇంతకుముందే స్పందించారు. ఇరాక్‌లో చిక్కుకుపోయిన వారి సంఖ్య 500 కాదని, కేవలం 52మందేనని వివరించారు. చిక్కుకుపోయిన వారంతా ఎర్బిల్‌లోని భారత దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు. వీసా గడువు ముగిసిన వెంటనే వెనక్కి రావాలని, గడువు ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటే జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.