జాతీయ వార్తలు

సరైన అర్హతలుంటేనే రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 9: విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే భారతీయ యువత అందుకు తగ్గ రీతిలో విద్యాపరంగాను, సాంకేతికపరంగాను నైపుణ్యానికి పదును పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. తగిన అర్హతలు లేకపోవడం వల్ల అనేక దేశాల్లో తాత్కాలిక ప్రాతిపదికను వెళ్లిన భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా ఉపాధి అవకాశాలకోసం వెళ్లే వ్యక్తులు అక్కడ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ రకంగా వచ్చే వ్యక్తులను ఆదుకునే విధంగా ప్రవాస భారతీయ సంస్థలు క్రియాశీలకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తులను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నప్పటికీ విదేశీ సంస్థలు ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. అలాగే ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చి వృత్తిపరంగా, సాంకేతికంగా దేశీయ యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. 14వ ప్రవాస భారతీయ దివస్ ముగింపు కార్యక్రమంలో సోమవారంనాడు మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ ఉపాధి అవకాశాలకోసం తాత్కాలిక ప్రాతిపదికన విదేశాలకు వెళ్లే భారతీయులు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే విషయంలో తగిన శ్రద్ధ వహించాలన్నారు. ముఖంగా గల్ఫ్ ప్రాంతంలోనూ, ఆగ్నేయ ఆసియాలోనూ ఇలాంటి భారతీయుల సంఖ్య భారీగానే ఉందన్నారు. తగిన అర్హతలు లేకుండా విదేశాలకు వెళ్తే ఉపాధి దొరుకుతుందన్న నమ్మకం వీరిని సమస్యల కూపంలోకి నెట్టేస్తోందన్నారు. తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులుగానే వీరంతా విదేశాలకు వెళుతున్నారని, ఇలాంటి వారినుంచే భారత్‌కు భారీ పరిమాణంలో విదేశీ మారక ద్రవ్యం జమ అవుతోందని కూడా ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2015లో ఈ విధంగా ప్రవాస భారతీయుల నుంచి జమ అయిన మొత్తాలు మొత్తం ప్రపంచ లెక్కలతో పోలిస్తే 12శాతం ఉన్నాయన్నారు. వీరిలో చాలామంది వెనక్కివచ్చేసే అవకాశం ఉన్నా, వీరు ఆయాదేశాల్లో ఉన్నంతకాలం మనుగడకు సంబంధించి ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారని తెలిపారు. ముఖ్యంగా సంఘర్షణలు, కల్లోలం నిత్యకృత్యాలుగా మారే దేశంలో ఉండే భారతీయుల పరిస్థితి దయనీయంగా మారుతోందని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా తగిన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రవాస భారతీయ సంస్థలు కూడా వీరికి సాయపడేందుకు ముందుకు రావాలన్నారు.
ప్రవాస దివస్ ముగింపు సందర్భంగా అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలు అవార్డుల పంట పండించుకున్నారు. అమెరికాకు చెందిన 30 మంది ఎన్‌ఆర్‌ఐలకు రాష్టప్రతి పిబిఎస్ అవార్డులను ప్రదానం చేశారు. తొలి అవార్డును పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా శాంటోజ్ డా కోస్టా అందుకున్నారు. ప్రజాసేవ రంగంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లకు చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులు పురస్కారాలను పొందారు. మొత్తం 20 దేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

చిత్రం..బెంగళూరులో సోమవారం ప్రవాసీ దివస్ ముగింపు కార్యక్రమంలో
పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియా శాంటోజ్ డా కోస్టాతో రాష్టప్రతి ప్రణబ్