జాతీయ వార్తలు

సైకిల్‌పై సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13:ఉత్తర ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీ ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తును ఎవరికి కేటాయించాలన్నదానిపై ఎన్నికల సంఘం తన తీర్పును వాయిదా వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ వర్గాల వాదనలను విన్న అనంతరం శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. సరైన సమయంలోనే తీర్పును వెలువరిస్తామని స్పష్టం చేసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఇరు వర్గాలు సైకిల్ గుర్తు తమకు కేటాయించాలంటే తమకే కేటాయించాలంటూ ఎన్నికల సంఘం ముందు తమ వాదనలు వినిపించాయి. పార్టీలో మెజార్టీ సభ్యుల బలం తనకే ఉందని, దీని దృష్ట్యా ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తునూ తనకే కేటాయించాలని అఖిలేష్ యాదవ్ తన వాదనను గట్టిగా వినిపించారు. అఖిలేష్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ‘పార్టీలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్‌ఎల్‌సిలు, డెలిగేట్ల మెజార్టీ మద్దతు తన క్లయింటేకే ఉన్నాయి’అని తేల్చిచెప్పారు. అనంతరం ములాయం వర్గం తమ వాదనలు వినిపించింది. అసలు అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించేందుకు జరిగిన సమావేశమే పార్టీ నియమావళికి విరుద్ధమని ఎన్నికల సంఘానికి వివరించింది. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 17 నుంచి మొదలు అవుతున్న దృష్ట్యా అప్పటిలోగా ఎన్నికల చిహ్నం ఎవరికి కేటాయించాలన్న విషయాన్ని నిర్ణయించలేక పోతే ఎన్నికల సంఘం తాత్కాలిక ఉత్తర్వును జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలో తమకే మెజార్టీ ఉందని పరస్పరం వాదించుకుంటూ సైకిల్ గుర్తు కోసం ఇరు వర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. తమ వాదనకు బలాన్ని చేకూర్చే విధంగా మద్దతుకు సంబంధించి పత్రాలనూ ఈసీ పరిశీలనకు అందించాయి. చట్ట సభ సభ్యులు, కార్యవర్గ సభ్యుల సంతకాలతో సోమవారానికల్లా అఫిడవిట్లను దాఖలు చేయాలని ఈసీ కోరింది. 51మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డెలిగేట్ల మద్దతు కలిగిన వర్గానికే సైకిల్ గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది. సైకిల్ గుర్తుపైనే ఇరు వర్గాలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి కాబట్టి తొలి దశ నామినేషన్ల ప్రక్రియకు ముందే ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.