జాతీయ వార్తలు

గంగానదిలో పడవ మునక..24 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 15: గంగానదిలో పడవ మునగడంతో మృతి చెందిన మరో నలుగురి మృతదేహాలను సహాయక బృందాలు ఆదివారం వెలికితీశాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 24కు పెరిగింది. మకర సంక్రాంతిని పురస్కరించుకొని బిహార్ రాష్ట్ర పర్యాటక శాఖ శనివారం ప్రారంభించిన పతంగుల పండుగకు హాజరై సాయంత్రం తిరిగివస్తున్న సమయంలో ఎన్‌ఐటి ఘాట్ వద్ద ఈ పడవ మునిగిపోయింది. పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించడం వల్లనే పడవ మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ప్రమాదానికి కారకులయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. నేషనల్ రిలీఫ్ ఫండ్‌నుంచి రూ. రెండు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున అందజేస్తామన్నారు. నదిలో మృతదేహాలకోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య ఇంకా పెరగకపోవచ్చని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రత్యయ అమృత్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. తమ కుటుంబ సభ్యులు కాని బంధువులు కాని కనిపించడం లేదని ఫిర్యాదు చేసినవారు ఇంకా ఎవరూ లేరని పేర్కొన్నారు. పడవ మునిగిపోయిన సమయంలో అందులో సుమారు 40 మంది ఉన్నారు. వీరంతా గంగానది తీరంలో గల సబల్‌పూర్ దియారా గ్రామంలో నిర్వహించిన పతంగుల పండుగకు హాజరై పాట్నాలోని రాణిఘాట్‌కు తిరిగి వస్తున్నవారే. ఈ ప్రమాదం తమను తీవ్ర విషాదానికి గురిచేసిందని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర పర్యాటక మంత్రి అనితాదేవి పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు కొనసాగవలసిన పతంగుల పండుగను పడవ ప్రమాదం వల్ల కొనసాగించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. పడవ ప్రమాదం వల్ల ఆదివారం పాట్నాలో జరగవలసిన మహాత్మా గాంధీ సేతు పునర్వికాస పనుల ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించవలసి ఉండింది.

చిత్రాలు..పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్.
*మృతిచెందిన వారిని గంగా నడి ఒడ్డునే అంత్యక్రియలు నిర్వహిస్తున్న బంధువులు