జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం సిద్ధూ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ గత ఏడాది నవంబర్‌లోనే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో సిద్ధూ కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు నిజమయ్యాయి. ‘కాంగ్రెస్ కుటుంబంలోకి ఎస్.నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానిస్తోంది. భావ సారూప్యత కలిగిన వ్యక్తులను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చే విషయంలో దార్శనిక వైఖరిని అవలంబిస్తున్న మా పార్టీ ఉపాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు. ముక్కు సూటిగా మాట్లాడే స్వభావానికి, జాతీయవాదం పట్ల సైద్ధాంతిక నిబద్ధతకు పెట్టింది పేరైన సిద్ధూలాంటి వ్యక్తుల చేరికతో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంతగానో బలోపేతమవుతుందనడంలో తమకు ఏమాత్రం సందేహం లేదని అన్నారు.
సిద్ధూతోపాటు అకాలీదళ్ మాజీ శాసనసభ్యుడు పర్గత్ సింగ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. బిజెపిలో చేరిన సిద్ధూ రెండుసార్లు 2004, 2009లలో అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన స్థానాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కేటాయించారు. 2016లో బిజెపి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య రాజ్యసభకు, బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని భావించారు. అక్కడా చర్చలు విఫలం కావడంతో ఆవాజ్-ఇ పంజాబ్ అనే పార్టీని ఏర్పాటుచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుంచి సిద్ధూ పోటిచేసే ఆవకాశం ఉంది.

చిత్రం..పార్టీ కండువా కప్పి సిద్ధూను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న రాహుల్