జాతీయ వార్తలు

‘సైకిల్’ రాకపోతే మా గుర్తు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 15: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీలో విభేదాలు తలెత్తడం, కుమారుడు అఖిలేష్ యాదవ్ దూరం కావడంతో దాదాపుగా ఒంటరై పోయి పార్టీ గుర్తు సైకిల్‌కోసం పోరాడుతున్న ములాయం సింగ్‌కు అనుకోని ఆఫర్ లభించింది. ఎన్నికల కమిషన్ గనుక ఒకవేళ సైకిల్ గుర్తును అఖిలేష్‌కు కేటాయించినా లేక ఇరు వర్గాల్లో ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేసినా తమ పార్టీ గుర్తును, జాతీయ అధ్యక్ష పదవిని అప్పగిస్తామని ములాయం సింగ్‌కు లోక్‌దళ్ ఆఫర్ చేసింది. లోక్‌దళ్ జాతీయ అధ్యక్షుడు సునీల్ సింగ్ ఆదివారం విలేఖరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. లోక్‌దళ్ పార్టీ గుర్తును, జాతీయ అధ్యక్ష పదవిని ములాయం సింగ్‌కు ఇస్తామని, ఆయనతో కలిసి యుపి ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ సిద్ధమేనని సునీల్ సింగ్ చెప్పారు. ఈ రోజు ములాయం సింగ్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయన చెప్పారు. సిబిఐ కేసునుంచి తన కుమారుడు, కుమార్తెను కాపాడుకోవడానికి రాంగోపాల్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని, ఆయన మాటలు నమ్మవద్దని, తండ్రి ములాయం మాట ప్రకారమే నడుచుకోవాలని ఆయన అఖిలేశ్‌కు సూచించారు.
నాగలితో పొలం దున్నుతున్న రైతు.. లోక్‌దళ్ గుర్తు. ఈ పార్టీకి ఇసి గుర్తింపు ఉంది. 1980లో సోషలిస్టు నాయకుడు చరణ్ సింగ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పట్లో ములాయం సింగ్ ఈ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ములాయం ఆ పార్టీకి దూరమై సమాజ్‌వాది పార్టీని ఏర్పాటు చేశారు. 2012 యుపి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌దళ్ 76 స్థానాలకు పోటీ చేసింది కానీ, ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.
సైకిల్ గుర్తు కేటాయింపుపై తీర్పు రిజర్వు చేసిన ఎన్నికల కమిషన్ తన తీర్పును ప్రకటించిన తర్వాత తమ ముందున్న మార్గాలు, ఆ తీర్పు ప్రభావం ఎన్నికలపై ఉంటుందనే దానిపై ఎస్పీలోని ప్రత్యర్థి వర్గాల నేతలు ఆదివారం రోజంతా తమ సన్నిహితులతో మంతనాలు జరిపిన నేపథ్యంలో లోక్‌దళ్ ఈ ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం. పార్టీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు పెద్దఎత్తున తమ మద్దతుదారులతో లక్నోలోని అఖిలేశ్, ములాయం నివాసాలకు ఆదివారం చేరుకుంటుండడంతో ఇరు వర్గాల శిబిరాలు సందడిగా మారాయి.
దేశం వదిలిపెట్టి వెళ్తున్నా: అమర్‌సింగ్
పార్టీలో తలెత్తిన సంక్షోభం, కుటుంబ కలహంగా మారడం, ములాయంకు సన్నిహితుడైన అమర్‌సింగ్‌ను పార్టీనుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి అఖిలేశ్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాను దేశం వదిలిపెట్టి వెళ్తున్నానని, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే దాకా తిరిగి రానని అమర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అమర్ సింగ్ లండన్‌లో చికిత్స చేయించుకోవడానికి వెళుతున్నట్లు చెప్పుకొన్నారు.