జాతీయ వార్తలు

ఆస్తుల వివరాలు ఇప్పుడే అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: లోక్‌పాల్ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించడానికి గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించింది. ఈ విషయమై కేంద్రం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు ఉద్యోగులు ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించవలసిన అవసరం లేదు. మామూలుగా అయితే వీటిని సమర్పించడానికి గడువు డిసెంబర్ 31. ప్రభుత్వం ఈ విషయమై తాజాగా నిబంధనలను రూపొందిస్తోందని, ఈ ప్రక్రియ ముగిసిన తరువాత మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డిఒపిటి) తెలిపింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఆ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించవలసి ఉంటుందని పేర్కొంది.