జాతీయ వార్తలు

మణిపూర్ పరిస్థితిపై కేంద్ర మంత్రుల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: మణిపూర్‌లో జాతీయ రహదారులపై 75 రోజులుగా ఆర్థిక దిగ్బంధం కారణంగా జన జీవనం స్తంభించిపోయిన నేపథ్యంలో ఆదివారం పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు భద్రతా అధికారులు అక్కడి పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమైనారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటుగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, హోం కార్యదర్శి రాజీవ్ మెహ్రిషితో పాటుగా పలువురు ఉన్నతాధికారులు దాదాపుగంట సేపుసమావేశమై ఆ రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. మణిపూర్ రాష్ట్రానికి జీవనాడిలాంటి 2వ నంబరు జాతీయ రహదారిపై బ్లాకేడ్‌ను తొలగించి దాన్ని తిరిగి ఎలా తెరవాలనే దానిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అసోంను నాగాలాండ్ మీదుగా మణిపూర్‌తో అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారిని ఎలా తెరవాలన్నదే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు టాప్ ప్రయారిటీగా మారింది.