జాతీయ వార్తలు

అడ్డంకి తొలగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: గత కొంతకాలంగా కొరకరాని కొయ్యగా మారుతూ వచ్చిన పన్ను చెల్లింపుదారుల నియంత్రణకు సంబంధించి అధికారాలను పంచుకునే విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సోమవారం ఏకాభిప్రాయం కుదిరింది. దేశవ్యాప్తంగా చారిత్రక రీతిలో పరోక్ష పన్నుల వ్యవస్థను అమలు చేసే దిశగా పడిన తొలి అడుగుగా భావిస్తున్నారు. తాజాగా ఈ కీలక అవగాహన కుదిరినప్పటికీ ముందు అనుకున్నట్టుగా ఏప్రిల్ 1నుంచి కాకుండా జూలై 1నుంచే జిఎస్టీని అమలు చేయాలని నిర్ణయించారు. వార్షిక టర్నోవర్ ప్రాతిపదికగా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అధికారాలను పంచుకునే విషయంలో రాష్ట్రాల డిమాండ్లను కేంద్రం అంగీకరించటంతో ఈ కీలక అవగాహన సాధ్యమైంది. ఇప్పటి వరకూ ఎన్నిసార్లు జిఎస్టీ మండలి సమావేశమైంది. నేడు జరిగిన ఈ తొమ్మిదో సమావేశంలో పన్ను చెల్లింపుదారుల వార్షిక టర్నోవర్‌పై విస్తృత ప్రాతిపదికనే చర్చ జరిగింది. అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రకారం వార్షిక టర్నోవర్ 1.5 కోట్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల మదింపు అధికారం 90శాతం మేర రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. మిగతా మొత్తానికి సంబంధించిన మదింపు వ్యవహారం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. వార్షిక టర్నోవర్ 1.5 కోట్లు మించిన పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్ర రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో అధికారాన్ని కొనసాగిస్తాయి. నేటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రాదేశిక జలాలకు సంబంధించి 12 నాటికల్ మైళ్ల పరిధిలో జరిగే ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కూడా పన్ను విధించే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తున్నామని జైట్లీ తెలిపారు. రాజ్యాంగపరంగా ఈ హక్కు కేంద్రానికే ఉన్నప్పటికీ, ఈ సదుపాయాన్ని రాష్ట్రాలకూ అందిస్తున్నట్టు వెల్లడించారు. అంతరాష్ట్రాల మధ్య జరిగే వస్తుసేవలపై పన్ను విధించే అధికారం కేంద్రానికే ఉన్నప్పటికీ చట్టంలోని కొన్ని ప్రత్యేక నిబంధనల దృష్ట్యా రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో అధికారాలను కల్పిస్తున్నామని జైట్లీ వెల్లడించారు. జిఎస్టీ ముసాయిదా తీర్మానాలను ఆమోదించేందుకు ఈ మండలి ఫిబ్రవరి 18న సమావేశం అవుతుందని, అదే సమయంలో ఇతర అనుబంధ శాసనాలను కూడా ఆమోదించటం జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అమల్లోవున్న ఎక్సైజ్, సేవా పన్ను, వ్యాట్ తదితర అన్నింటికీ కూడా ఒకే చట్రంలోకి తీసుకురావడానికి జిఎస్టీ విధానమే ఏకైక పన్ను విధానంగా అమలుకావడానికి ఇది అవసరమని జైట్లీ తెలిపారు. తాజా అవగాహన నేపథ్యంలో జూలై 1నుంచి నూటికి నూరు శాతం జిఎస్టీ అమలుకు వాస్తవికంగా పరిస్థితులు మెరుగయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి పన్ను మదింపుదారుడి పన్న అంచనాను ఇకనుంచి ఒకే అథారిటీ చేస్తుందని, ఇందుకు సంబంధించి భిన్న పార్శ్వాలు ఉండవని స్పష్టం చేశారు. 1.5 కోట్ల టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులపై పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉండాలని తాను వాదించినట్టు, జిఎస్టీ నిర్ణయంతో విభేదించినట్టు పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. అయితే 90శాతం ఈ రకమైన మదింపుదారులను రాష్ట్రాల పరిధిలోకి తేవడం అన్నది చిన్న వర్తకుల ప్రయోజనాలకు పరిరక్షించే దిశగా సాధించే విజయమని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..జిఎస్టి కౌన్సిల్‌లో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ