జాతీయ వార్తలు

పిఎసితో ఆర్థిక శాఖ అధికారుల భేటీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: పెద్ద నోట్ల రద్దు విషయమై ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించాల్సిన సమావేశాన్ని పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) వాయిదా వేసింది. సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు జరుగుతున్న కసరత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని, అయితే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం ఇంతకుముందు నిర్ణయించినట్లుగానే ఈ నెల 20వ తేదీన తమ ఎదుట హాజరవుతారని పిఎసి చైర్మన్ కెవి.్థమస్ సోమవారం వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు విషయమై ఉర్జిత్ పటేల్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులు ఈ నెల 20వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని పిఎసి గతంలో ఆదేశించింది. ఈ ఆదేశం మేరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఈ నెల 20వ తేదీనే తమ ఎదుట హాజరవుతున్నారని, అయితే ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ఈ సమావేశానికి రావడం లేదని, బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ పూర్తయ్యే వరకు తమకు సమయాన్ని ఇవ్వాల్సిందిగా వారు కోరారని థామస్ వివరించారు.