జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ఉత్తరాఖండ్ పిసిసి మాజీ చీఫ్ యశ్‌పాల్ ఆర్య సోమవారం బిజెపిలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని దక్కించుకోవటానికి బిజెపి రచిస్తున్న వ్యూహాల్లో కాంగ్రెస్‌కు మొదటి దెబ్బ పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య, పాజీ ఎమ్మెల్యే కేదార్‌సింగ్ రావత్ కమలం పార్టీలోకి మారిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో యశ్‌పాల్ ఒకరు. కాంగ్రెస్‌లో ఒకనాటి విలువలు మృగ్యమయ్యాయని ఆర్య అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్య ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ వ్యవహారశైలి పట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్య తమ పార్టీలోకి రావటం పట్ల బిజెపి ఉత్తరాఖండ్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. నిరుడు మార్చి నెలలో అధికార పార్టీలో నెలకొన్న సంక్షోభంతో తొమ్మిది మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడిపోయారు. ఇప్పుడు మరో సీనియర్ నేత బిజెపి గూటికి చేరటం కాంగ్రెస్‌కు సమస్యాత్మకమే. ‘ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పరిస్థితి మునుగుతున్న నావలా మారిపోయింది’ అని బిజెపి ప్రతినిధి మున్నాసింగ్ చౌహాన్ అన్నారు.