జాతీయ వార్తలు

మోదీ ఓ నియంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుషీకేశ్ (ఉత్తరాఖండ్), జనవరి 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) వంటి సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెద్ద నోట్లు రద్దు చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఒక రోజు ముందు మాత్రమే మోదీ ఆర్‌బిఐ గవర్నర్‌కు తెలిపారని రాహుల్ పేర్కొన్నారు. ‘ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పనిచేయాలని ఆర్‌బిఐని ఏర్పాటు చేశారు. అయితే, మోదీజీ రూ.500, 1000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించాలని నిర్ణయించారు అని పేర్కొంటూ రద్దు చేయడానికి ఒక రోజు ముందు ఒక లేఖను ఆర్‌బిఐ గవర్నర్‌కు పంపించారు’ అని రాహుల్ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ నియంతృత్వ పోకడలు చాలా దూరం వెళ్లాయని విరుచుకుపడ్డారు. మోదీ ప్రతి దానిపైనా తన ముఖాన్ని ముద్రించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల వివాదాస్పదమైన ఖాది, గ్రామీణ పరిశ్రమల కమిషన్ డైరీ ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ డైరీపై సాధారణంగా చరఖా తిప్పుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఉంటుంది. అయితే ఈసారి గాంధీజీ స్థానంలో మోదీ చరఖా తిప్పుతున్నట్లు ఉన్న ఫొటోను ముద్రించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం నుంచి రామమందిరాలలో రాముడికి బదులు మోదీ మాస్కులు ధరించిన నటులు నిలబడతారని రాహుల్ ప్రజలను హెచ్చరించారు. మోదీ తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. మోదీ అందరి గొంతులను నొక్కాలని చూస్తున్నారని, కేవలం తన గొంతు మాత్రమే వినపడేలా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మోదీ తనకు ఖాదీపట్ల నిబద్ధత ఉన్నట్టు ప్రకటించుకున్నారని, కాని, అది అబద్ధమని రాహుల్ అన్నారు. 15 లక్షల ఖరీదైన సూట్‌కు, చరఖాకు పొంతన కుదరని, ఇవి రెండూ కలసి సాగలేవని ఆయన మోదీ తీరును ఎద్దేవా చేశారు. కుటీర, హస్తకళల పరిశ్రమ ప్రోత్సాహానికి చిహ్నంగా చరఖా నిలిచిందని పేర్కొంటూ మోదీ నిజంగా ఖాదీని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటే కేవలం ఎంపిక చేసిన 50 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడానికే తన సమయమంతా పనిచేసి ఉండేవారు కాదని రాహుల్ అన్నారు. మోదీ తరచుగా సంపన్నులతో కలిసి ఫొటోల్లో కనిపిస్తుంటారని పేర్కొంటూ ఆయన రైతులు, పేదలకోసం ఎప్పుడూ పనిచేయరనే విషయాన్ని ఇది సూచిస్తోందని రాహుల్ విమర్శించారు. ‘మోదీ వైఖరి ఏదేమైనా తాను అనుకున్నది సాధించాలనే రీతిలో ఉంది. ఆయన పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా భూసేకరణ చట్టాలను మార్చారు. ఆయన రైతులను విశ్వాసంలోకి తీసుకోకుండానే వారి భూములను లాక్కొని తన స్నేహితులయిన పారిశ్రామికవేత్తలకు పంచి పెట్టగలరు’ అని రాహుల్ ధ్వజమెత్తారు.

చిత్రం..రుషీకేశ్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తన చినిగిపోయన కుర్తాను చూపుతున్న రాహుల్