జాతీయ వార్తలు

ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలపై అభియోగాలు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 17: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయికి చెందిన షీనాబోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ, మాజీ భర్త సంజీవ్ ఖన్నాలపై మంగళవారం స్థానిక సిబిఐ కోర్టులో హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేయడంతో వారిపై విచారణ ప్రారంభం కావడానికి రంగం సిద్ధమయింది. కాగా, తన భర్త పీటర్ ముఖర్జీతో విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఇంద్రాణి ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలియజేయగా, ఇది మీ ఇద్దరూ తేల్చుకోవలసిన అంశమని, దానితో కోర్టుకు సంబంధం లేదని జడ్జి స్పష్టం చేశారు. నిందితులందరిపైనా ఐపిసిలోని 120(బి) (నేరపూరిత కుట్ర), 302 (హత్య) తదితర అభియోగాలు మోపారు. అనంతరం జడ్జి హెచ్ ఎస్ మహాజన్ విచారణ ప్రారంభం కావడానికి ఫిబ్రవరి 1వ తేదీని నిర్ణయించారు. కాగా నిందితులు ముగ్గురు కూడా తాము నిర్దోషులమని వాదించారు. ఇదే కాకుండా షీనా బోరా సోదరుడు మైకేల్ బోరాను హత్య చేయడానికి ప్రయత్నించారని ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాలపై మరో కేసు కూడా నమోదైంది. 2012 ఏప్రిల్ 24న ఇంద్రాణి తన మాజీ భర్తతో కలిసి కుమార్తె షీనాబోరాను కారులోనే హత్య చేశారన్న ఆరోపణలతో సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

చిత్రం..ఇంద్రాణి ముఖర్జీ