జాతీయ వార్తలు

బిజెపిలో అసంతృప్తి సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జనవరి 17: ఉత్తరాఖండ్‌లో వచ్చే నెల 15న జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌నుంచి ఫిరాయించిన వారందరికీ దాదాపుగా టికెట్లు ఇవ్వడంపై పార్టీలోని ఒక వర్గం తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతోంది. బయటినుంచి దిగుమతి అయినవారికి అవకాశం ఇవ్వడానికి పార్టీకోసం ఇంతకాలం విశ్వాసంగా పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వకపోవడం పట్ల పార్టీ నేతలు పలువురు మనస్తాపంతో ఉన్నారు. ఇలా పార్టీ టికెట్లకోసం పోటీపడిన బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాలు 20కి పైగానే ఉండడంతో వీరిలో కొంతమంది అధికార అభ్యర్థులపై ఇండిపెండెంట్లుగా పోటీ చేయవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.
అసంతృప్తితో ఉన్న నేతల్లో చాలామంది తమ మనసులోని అభిప్రాయాలను బైటికి చెప్పకపోయినప్పటికీ తమ ఆగ్రహాన్ని మాత్రం దాచుకోవడం లేదు. కాంగ్రెస్‌నుంచి బిజెపిలోకి ఫిరాయించిన సుబోధ్ ఉనియాల్‌ను నరేంద్రనగర్ నియోజకవర్గంనుంచి అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గానికి దీర్ఘకాలంగా సేవలందించిన బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓం గోపాల్ రావత్ తాను అక్కడినుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తిరుగుబాటుదారులు పోటీ చేస్తున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని బిజెపి నేతల్లోను అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేదార్‌నాథ్ సీటునుంచి టికెట్ ఆశించిన ఆశా నౌటియాల్ ఆ స్థానంనుంచి కాంగ్రెస్‌నుంచి వచ్చిన శైలారాం రావత్‌కు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే కోట్‌ద్వార్‌నుంచి మరో కాంగ్రెస్ ఫిరాయింపుదారు హరక్ సింగ్ రావత్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే శైలేంద్ర సింగ్ రావత్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రూర్కీనుంచి ప్రదీప్ బాత్రాను అధికార అభ్యర్థిగా బిజెపి ప్రకటించడం పట్ల పార్టీ మాజీ ఎమ్మెల్యే సురేష్ చాంద్ ఉడికిపోతున్నారు. తనను మోసం చేశారని అంటున్న ఆయన పట్టణ అభివృద్ధికోసం తాను తప్పకుండా పోటీ చేస్తానని అంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా బిజెపి టికెట్లు నిరాకరించింది. అలాంటి వారిలో యంకేశ్వర్ ఎమ్మెల్యే విజయ్ బర్త్‌వాల్, చౌబతాఖల్ ఎమ్మెల్యే, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తీరథ్ సింగ్ రావత్ ప్రముఖులు. మాజీ ముఖ్యమంత్రి, పౌరీ ఎంపి బిసి ఖందూరి కుమార్తె రీతూ ఖందూరికి అవకాశమివ్వడం కోసం బర్త్‌వాల్‌కు టికెట్ నిరాకరించగా, కాంగ్రెస్‌నుంచి ఫిరాయించిన అమృతా రావత్ భర్త సత్పాల్ మహరాజ్ కోసం తీరథ్ సింగ్‌కు టికెట్ ఇవ్వలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నేతల్లో తలెత్తిన అసమ్మతి బిజెపి అధినాయకత్వానికి సైతం మింగుడుపడ్డం లేదు. మరోవైపు ఇలా అసమ్మతితో రగిలిపోతున్న బిజెపి నేతలను తమ వైపునకు తిప్పుకుని పార్టీనుంచి బిజెపిలోకి పిరాయించిన తిరుగుబాటుదారులపై పోటీకి నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.

చిత్రం..కాంగ్రెస్ పార్టీలో చేరిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం అమృత్‌సర్ సందర్శించినప్పటి చిత్రం