జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జనవరి 19: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు పేలడంతో ఒక బాలిక సహా ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ఇదే ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. నారాయణపూర్ జిల్లాలో సోంతుపూర్ - కుర్స్రూనార్ గ్రామాల మధ్య భద్రతాదళాల పర్యవేక్షణలో నూతన రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పోలీసు బలగాలను మట్టుపెట్టడానికి మావోయిస్టులు తూంనార్ గ్రామ సమీప ప్రాంతంలో శక్తిమంతమైన ఐఇడి బాంబులను అమర్చారు. బుధవారం రాత్రి తూంనార్ గ్రామానికి చెందిన ప్రజలు రహదారిపై వెళుతున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలపై కాలు మోపడంతో మందుపాతర పేలింది. దీంతో 15 సంవత్సరాల బాలికతో సహా ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందినట్లు బస్తార్ ఐజి ఎస్‌ఆర్‌పి కల్లూరి తెలిపారు. అలాగే ఈ ఘటనలో రెండు సంవత్సరాల బాలుడు, ముగ్గురు మహిళలు తీవ్ర గాయాలపాలైనట్టు ఐజి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను నారాయణపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, వైద్యం అందిస్తున్నట్టు ఐజి చెప్పారు.

చిత్రం..మందుపాతర పేలుడులో తీవ్రంగా గాయపడిన మహిళ