జాతీయ వార్తలు

2012 బడ్జెట్ జాప్యం సమయంలో పాటించిన విధానాలేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: 2012లో కేంద్ర బడ్జెట్‌ను ఆలస్యంగా సమర్పించినప్పుడు ప్రభుత్వం పాటించిన విధి విధానాలతో పాటుగా దీనికి సంబంధించి తాజా వివరాలను తెలియజేయాలని ఎన్నికల కమిషన్ క్యాబినెట్ సెక్రటేరియట్‌ను కోరింది. శుక్రవారం ఉదయానికల్లా ఈ వివరాలను తెలియజేయాలని క్యాబినెట్ సెక్రటేరియట్‌కు బుధవారం రాసిన తాజా లేఖలో ఇసి కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కేంద్ర బడ్జెట్ రూపకల్పన, సమర్పణకు పాటించే ప్రక్రియ వివరాలను సైతం తెలియజేయాలని ఇసి కోరింది. 2012లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడంపై అప్పుడు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలియజేయడంతో అప్పటి యుపిఏ ప్రభుత్వం వారి డిమాండ్‌ను అంగీకరించి బడ్జెట్‌ను ఫిబ్రవరి 28నుంచి మార్చి 16కు వాయిదా వేసింది. కాగా, ఇప్పుడు సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడంపై అభ్యతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు దీనిపై ఇసికి సైతం ఫిర్యాదు చేశాయి. దీనిపై ఇసి కేంద్రాన్ని వివరణ కోరగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఈ నెల 10న కమిషన్‌కు సమాధానమిచ్చింది. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి వారంలో సమర్పిస్తుండగా, ఈసారి నెల రోజుల ముందే బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండడం తెలిసిందే. దీనికి అనుగుణంగా జనవరి 31నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.