జాతీయ వార్తలు

ఆర్డినెన్స్ తెస్తే.. మళ్లీ న్యాయ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: తమిళనాడులో అగ్గి రాజేస్తున్న జల్లికట్టు నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే న్యాయపరంగా పోరాడాలని జంతుపరిరక్షణ సంస్థ పెటా నిర్ణయించింది. ‘మా పోరాటం జంతువులను హింసించటంపైనే. ఒకవేళ ఆర్డినెన్స్ కనుక వస్తే మా న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అని పెటా ప్రతినిధి మనీలాల్ వల్లియత్ తెలిపారు. జల్లికట్టును సమర్థించేవారు తప్పుడు సమాచారంతో తప్పుడు అవగాహనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకులు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా చదివిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని వివరించారు.
మద్రాస్ హైకోర్టులో తేల్చుకోండి: సుప్రీం
జల్లికట్టుపై తమిళనాడులో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని మద్రాస్ హైకోర్టు విచారిస్తుందని, పిటిషనర్ అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఢిల్లీ దాకా రావలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఎన్. రాజారామన్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించింది. మూడు రోజులుగా మెరీనా బీచ్ వద్ద జరుగుతున్న ఆందోళనలు చేస్తున్న నిరసనకారులకు రక్షణ కల్పించాలని, 2011లో రాంలీలా మైదాన్‌లో బాబా రాందేవ్ మద్దతుదారులపై లాఠీచార్జి చేసినట్లుగా దురాగతానికి పాల్పడకుండా అడ్డుకోవాలని తన పిటిషన్‌లో కోరారు.
జల్లికట్టు సాంస్కృతిక చిహ్నం
జల్లికట్టు తమిళుల సాంస్కృతిక చిహ్నమని ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. క్రీడకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు గురువారం ఆయన మద్దతు ప్రకటించారు. జల్లికట్టుకు పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. మెరీనాబీచ్ వద్ద జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

చిత్రం..జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తమిళనాడులోని సేలంలో రైల్‌రోకో నిర్వహిస్తున్న ఆందోళనకారులు