జాతీయ వార్తలు

దిద్దుబాటు చర్యల్లో అఖిలేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 19: తమదే అసలైన సమాజ్‌వాది పార్టీ అని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇంతకుముందు తన చిన్నాన్న, యుపి పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ క్రమశిక్షణా చర్య కింద సస్పెండ్ చేసిన 9 మందిపై సస్పెన్షన్ ఎత్తివేశారు. సమాజ్‌వాది పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అఖిలేష్ యాదవ్ తీసుకున్న తొలి ప్రధాన నిర్ణయం ఇది.
అఖిలేశ్‌ను తిరిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేసినందుకు సమాజ్‌వాది యువజన్ సభ రాష్ట్ర అధ్యక్షుడు బ్రజేష్ యాదవ్, సమాజ్‌వాది ఛాత్రసభ అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్‌లను కూడా క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ములాయం సింగ్ ‘బయటివారి’ ప్రభావానికి గురవుతున్నారని ఆరోపించినందుకు పార్టీనుంచి వెలివేసిన ఎమ్మెల్సీ ఉదయ్‌వీర్ సింగ్‌ను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ మేనల్లుడు, ఎమ్మెల్సీ అరవింద్ యాదవ్‌ను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈయనపై శివపాల్ యాదవ్ భూ అక్రమణలకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ మహిళా సభ రాష్ట్ర అధ్యక్షురాలిగా గీతాసింగ్‌ను నియమించిన అఖిలేశ్, శివపాల్ యాదవ్ తొలగించిన యువజన నాయకులందరినీ తిరిగి వారి పదవుల్లో పునరుద్ధరించారు.
ఈ నెల 1న జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత పార్టీపై పూర్తి పట్టు సాధించిన అఖిలేశ్ యాదవ్ దాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడి హోదాలో 11 జిల్లాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమించడమే కాకుండా వచ్చేనెల 3న యుపి శాసనమండలిలో మూడు స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకోసం అభ్యర్థులను సైతం ప్రకటించారు.