జాతీయ వార్తలు

కన్న కొడుకైనా సరే నేరం చేస్తే వదిలేది లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: నేరం చేసిన వాడు కన్న కొడుకైనా సరే శిక్షనుంచి తప్పించుకోకూడదని ఢిల్లీకి చెందిన ఓ పోలీసు అధికారి నిరూపించాడు. తన కొడుకు నేరం చేశాడని తెలియడంతో తానే స్వయంగా అతడ్ని పట్టుకోవడంలో పోలీసులకు సాయపడి విధి నిర్వహణ పట్ల తన నిబద్ధతను చాటుకోవడమే కాక ఎంతో మంది పోలీసులకు ఆదర్శంగా నిలిచాడు ఏఎస్సై రాజ్ సింగ్.్ఢల్లీలో ఇటీవల 23 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు దాడి చేశారు. ప్లేస్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న ఆ యువతిని 9 సార్లు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఆ యువతి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ సంఘటనతో తన కుమారుడు అమిత్‌కు సంబంధం ఉందని తెలుసుకున్న రాజ్ సింగ్ అతడ్ని పట్టుకోవడానికి దర్యాప్తు బృందానికి సహకరించాడు. ఢిల్లీ పశ్చిమ జిల్లాలో ఏఎస్సైగా పని చేస్తున్న రాజ్ సింగ్ వారం రోజులు మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలో ఈ యువతిపై దాడి ఘటనలో తన కుమారుడికి సంబంధం ఉందనే విషయం తెలిసింది. వెంటనే అతను బుధవారం రాత్రి నజఫ్‌గఢ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాడు. ఈ కేసులో తన కుమారుడి హస్తం ఉందని, అతడ్ని పట్టుకోవడానికి సహకరిస్తానని వారితో చెప్పాడు. కేసును ఛేదించడానికి క్లూల కోసం వెతుకుతున్న పోలీసులకు అది వరంగా మారింది. కాగా, పోలీసుల వద్దకు వెళ్లడానికి ముందు రాజ్‌సింగ్ తన బంధువులందరితో మాట్లాడి అమిత్‌కు ఆశ్రయం కల్పించవద్దని వారందరినీ హెచ్చరించాడు. అంతేకాదు అమిత్ దాగి ఉండవచ్చన్న అనుమానంతో కొన్ని ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వెతికాడు కూడా. ప్రస్తుతం పోలీసులు అమిత్‌తో పాటుగా అతనికి సహకరించిన మిత్రుడ్ని కూడా అరెస్టు చేశారు. కుమారుడికన్నా విధి నిర్వహణే తనకు ముఖ్యమని రాజ్‌సింగ్ తనతో చెప్పాడని, అతను నిజంగా మిగతా పోలీసులకు ఆదర్శమని నగర జాయింట్ పోలీసు కమిషనర్ దీపేంద్ర దాస్ పాఠక్ ప్రశంసించారు.