జాతీయ వార్తలు

పొత్తుపై నీలినీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ,కాంగ్రెస్ పార్టీల పొత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. కలిసి పోటీ చేసేందుకు ఎస్‌పి అధినేత, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ వైపు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే శుక్రవారం 199 మంది పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసేశారు. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నీలి నీడలు అలుముకున్నాయి. శాసన సభలో కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ నాయకుడు ప్రదీప్ మాథుర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మాథుర్, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సంజయ్ రాపూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బిలాస్‌పూర్‌తోపాటు మరికొన్ని కాంగ్రెస్ నియోజకవర్గాలకు ఎస్‌పి అభ్యర్థులను అఖిలేశ్ ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు యూపీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ లక్నోలోనే మకాం వేసి సమాజ్‌వాదీ పార్టీ అధినాయకులతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్న సమయంలోనే అఖిలేశ్ యాదవ్ మొత్తం 403 సీట్ల నుంచి 199 అంటే దాదాపు సగం సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 12 శాసన సభ సీట్లలో అఖిలేశ్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడం గమనార్హం. దీనికితోడు ముస్లింలు మెజారిటీలో ఉన్న దెయోబంద్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రస్తుత సభ్యుడు మవియా అలీని పార్టీలో చేర్చుకోవటంతోపాటు అతనికి ఏకంగా టికెట్ కేటాయించారు. అమేథీ, రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాలోని అన్ని అసెంబ్లీ సీట్లతోపాటు మొత్తం 80 సీట్లు, ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌పై వత్తిడి పెంచటం ద్వారా ఇరకాటంలో పడవేసేందుకు అఖిలేశ్ యాదవ్ ఈ విధంగా చేశారని అంటున్నారు. తన తండ్రి, లోక్‌సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్, బాబాయి శివపాల్ యాదవ్‌లపై రాజకీయంగా పట్టుసాధించిన అఖిలేశ్ 199 మంది పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయటం ద్వారా కాంగ్రెస్ పై మానసిక వత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అజిత్‌సింగ్ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌డితో సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు ఖరాఖండీగా నిరాకరించటంతో సీట్ల సర్దుబాటు చర్చల్లో కాంగ్రెస్ ఏకాకిగా మారింది. అజిత్‌సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకు అఖిలేశ్ నిరాకరించినప్పుడే కాంగ్రెస్ నీరు కారిపోయింది. ఇప్పుడు 199 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయటంతో కాంగ్రెస్‌పై వత్తిడి మరింత పెరిగిందని అంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు అఖిలేష్‌యాదవ్ సిద్ధంగా ఉన్నా అది తన ఆలోచన మేరకు జరగాలన్నది ఆయన పట్టుదల. కాంగ్రెస్‌తో పొత్తుకుదిరే పక్షంలో కాంగ్రెస్ గెలిచిన సీట్ల నుంచి తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంటామని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ల మధ్య శుక్రవారం రాత్రి పొద్దుపోయేంత వరకు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.