జాతీయ వార్తలు

ఇక ఒకే బడ్జెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా కాకుండా కేంద్ర బడ్జెట్‌తోకలిపి ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆర్థిక వ్యవహారాల విభాగం కసరత్తు చేసింది. కేబినెట్ సెక్రెటేరియట్ ఆదేశాల మేరకు దీనికి రూపకల్పన చేశారు. ఇంతకు వేర్వేరుగానే బడ్జెట్‌లకు ఆర్థిక వ్యవహారాల శాఖ రూపొందించేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా( అలకేషన్ ఆఫ్ బిజినెస్) నిబంధనలు 1961 సవరించి రెండు బడ్జెట్లు రూపొందించారు. 2017-18 కేంద్ర బడ్జెట్‌తో కలిపే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలుగా గత సెప్టెంబర్‌లో కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టడం 1924 నుంచి వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తిచెబుతున్నారు.