జాతీయ వార్తలు

వంశధార నిర్మాణాలపై ఏపి సర్కార్‌కు సుప్రీం నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నేరడి ప్రాజెక్టు, కాట్రగడ వద్ద వరద కాలువ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వంశధార నదీ సంబంధించిన కేసులు ఇటు సుప్రీంకోర్టు అటు ట్రిబ్యునల్‌లో ఉండగానే ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని ఒడిశా ప్రభుత్వం ఆరోపిస్తోంది. వేంటనే ఆ నిర్మాణాలను తక్షణం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను జస్టిస్ మదన్ బి లోకూర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒడిశా లేవనేత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వనికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.