జాతీయ వార్తలు

దిగివచ్చిన అమెజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మను ముద్రించిన చెప్పులను అమ్ముతూ భరత జాతిని అవమానించిన అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ ఎట్టకేలకు దిగివచ్చింది. సున్నిత మనస్కులైన భారతీయుల మనోభావాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంతో ఈ చెప్పుల అమ్మకాలను నిలిపివేసింది. విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ విషయాన్ని వెల్లడించారు. థర్డ్ పార్టీ వ్యాపారులకు వేదికగా నిలుస్తున్న అమెజాన్‌కు భారతీయుల మనోభావాలను గౌరవించాల్సిందిగా స్పష్టం చేయాలని వాషింగ్టన్‌లోని భారత రాయబారిని ఆదేశించడం జరిగిందని, ఈ విషయమై వాషింగ్టన్‌తో పాటు ఢిల్లీలోని అమెజాన్ అధికారులతో తాము నిర్మాణాత్మక చర్చలు జరపడంతో ఆ సంస్థ ఆ చెప్పుల అమ్మకాలను నిలిపివేసిందని వికాస్ స్వరూప్ తెలిపారు. భారత జాతీయ పతకాన్ని ముద్రించి ఉన్న డోర్ మ్యాట్లను అమ్ముతుండటంతో కెనడాలోని అమెజాన్ శాఖకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గత వారం ఇదేవిధమైన ఫిర్యాదు చేసిన విషయం విదితమే. భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే భారత్‌లోని అమెజాన్ ఉద్యోగుల నుంచి వీసాలను వెనక్కి తీసేసుకోవడంతో పాటు ఇకముందు ఆ సంస్థ ఉద్యోగులకు భారత వీసాలను మంజూరు చేయబోమని సుష్మా స్వరాజ్ ఘాటుగా హెచ్చరించడంతో ఆ డోర్ మ్యాట్ల అమ్మకాలను అమెజాన్ నిలిపివేసింది.