జాతీయ వార్తలు

పొత్తు పొడిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 22: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌లు సంయుక్తంగానే సమరభేరి మోగించాయి. మతతత్వ శక్తుల్ని తరిమికొట్టే లక్ష్యంతో ఉమ్మడిగానే పోటీ చేస్తున్నట్టు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించాయి. వారాల పాటు జరిగిన మంతనాలు, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడంతో ఎవరెన్ని స్థానాలకు పోటీ చేయాలన్న అంశమూ ఖరారైందని తెలిపాయి. తాజా పొత్తు ఒప్పందం ప్రకారం అధికార సమాజ్‌వాది పార్టీ 298స్థానాలకు పోటీ చేస్తుంది. మిగిలిన 105సీట్లు కాంగ్రెస్‌కు దక్కాయి. హడావుడిగా ఏర్పాటు
చేసిన మీడియా సమావేశంలో యుపిసిసి రాజ్‌బబ్బర్, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ యాదవ్ మాట్లాడారు. మతతత్వ శక్తుల్ని తరిమికొట్టాలన్నదే తమ పొత్తు లక్ష్యమని ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో తమ కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని తీరుతుందని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని రాజ్‌బబ్బర్ అన్నారు. ఇరు పార్టీలు చర్చించిన మీదట వారంలోనే కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న మీదట సమాజ్‌వాది పార్టీ ఇచ్చిన 105 సీట్లను తాము అంగీకరించామని చెప్పారు. బిజెపి మతతత్వ ధోరణులను తిప్పికొట్టాలంటే సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకోవడమే ఏకైక మార్గంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగా మత సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు లౌకిక భావనలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సమాజ్‌వాది పార్టీ సిద్ధాంతాలతో తమ పార్టీ అనేక కోణాల్లో ఏకీభవిస్తోందన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధి,శాంతి సామరస్యాల పరిరక్షణ, సుహృద్భావ రాజకీయ వాతావరణాన్ని పెంపొందించడమే తమ పొత్తు ఉద్దేశమన్నారు. పెద్ద నోట్ల రద్దుతో జాతి జీవనాన్ని కకావికలు చేసిన బిజెపికి తగిన రీతిలో బుద్ధి చెప్పే అవకాశం రాష్ట్ర ప్రజలకు దక్కిందన్నారు. అసలు పొత్తు కుదురుతుందా లేదా అనుకున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

చిత్రం..ఆదివారం లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో కరచాలనం చేసుకుంటున్న సమాజ్‌వాది, కాంగ్రెస్ నేతలు